ఎడపల్లి మండల కోశాధికారి పొద్దుటూరీ సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానం

ఎడపల్లి, నవంబర్ 05 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియామకం చేయడం హర్షినియమని ఎడపల్లి మండల కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్ అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి వైద్య విద్య నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధితోపాటు నిజామాబాద్ జిల్లాలో ఎంతగానో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంవల్ల ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వచ్చిందని కొనియాడారు అలాగే రైతుల కొరకు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టి రైతులకు ఆదుకున్న ఘనత ప్రభుత్వ సలహాదారునికి దక్కిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారునిగా నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు బొబ్బిలి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతకు ముందుగా ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు