వయోవృద్ధుల సంరక్షణ పోషణ చట్టం పై అవగాహన
ఎడపల్లి, నవంబర్ 07 ( లోకంతీరు ) : సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టంపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామకృష్ణ సభ అధ్యక్షులు గా రాష్ట్ర కార్యదర్శి శ్రీ పి విశ్వనాథం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి రాజలింగం సభ్యులు సిహెచ్ గంగారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు నిజాముద్దీన్ రాజేష్ లక్ష్మి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.