బ్యాంక్ మిత్ర కేంద్రాన్ని ప్రారంభించిన మేనేజర్
కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రావణ్ కుమార్ ![]()
![]()
![]()
![]()
ఎడపల్లి, నవంబర్ 11( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో మంగళవారం కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రావణ్ కుమార్ బ్యాంక్ మిత్ర కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. కెమెరా బ్యాంకు తో ఎస్బిఐ, ఎస్బిహెచ్, ఇతర బ్యాంకులకు అనుసంధానం ఉంటుందన్నారు. సంబంధించిన లావాదేవీలను బ్యాంకు మిత్ర కేంద్రం ద్వారా బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్క వినియోగదారులతో పాటు బ్యాంకులో డబ్బులు జమ చేసుకున్న రైతులు, స్థానిక ప్రజలు బ్యాంకు మిత్ర ద్వారా తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కెనరా బ్యాంక్ తో పాటు ఎస్బిఐ, ఆంధ్ర బ్యాంక్ ఇతర బ్యాంకులకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పక ఉండాలన్నారు. మంగల్ పహాడ్ గ్రామంలో బ్యాంకు మిత్ర కొనసాగించడానికి ముందుకు వచ్చిన తక్కెల అర్చన ను గ్రామ పెద్దలు ,యువకులు, బ్యాంకు ఖాతాదారులు గ్రామ ప్రజలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.తక్కెల అర్చన చిరు వ్యాపారంతో రాణిస్తూ బ్యాంకు అధికారులతో సమన్వాయిగా ఉంటూ, సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అర్చనను బ్యాంక్ అధికారులతో పాటు సిబ్బంది కొనియాడారు. స్థానిక ప్రజలకు, రైతన్నలకు చిరు వ్యాపారులకు ఆమె ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవనందిస్తారని ఆయన అన్నారు. కెనరా బ్యాంక్ అధికారుల సహాయ సహకారాలు ఆమెకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా మంగల్ పహాడ్ గ్రామంలో మిత్ర కేంద్రం ఏర్పాటు కావడం వల్ల గ్రామంలోని ప్రతి ఒక్కరికి తక్కెల అర్చన తమ వంతు సేవలను అందిస్తారని ఆయన అన్నారు. తక్కెల అర్చనను స్థానిక గ్రామస్తులు యువకులు అభినందించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ సిబ్బంది, మంగల్ పాడు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.


