Take a fresh look at your lifestyle.

పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలిరండి….

0

పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలిరండి

– తెలంగాణ పసుపు రైతుల సంఘం పిలుపు

ఆర్మూర్, జూన్ 26 ( లోకంతీరు ) :  నిజామాబాద్ కేంద్రంలో జూన్ 29 న జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రులు అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ పసుపు రైతుల సంఘం తరపున గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రధానంగా ఉన్న తక్కూరి వాడ, బద్దం వాడ, యలాలవాడ, గాంధీనగర్ వాడ రైతు సంఘాల పెద్దమనుషులను కలిసి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ పసుపు రైతుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు, బిజెపి సీనియర్ నాయకుడు బద్దం లింగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాట్కూరి తిరుపతి రెడ్డి, రుక్మాజి అన్ని సంఘాల సభ్యులను కలిసి సభను విజయవంతం చేయాల్సిందిగా, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘాల పెద్దమనుషులు మహిపాల్, శ్రావణ్, రంజిత్, ప్రతాప్, లింగాపురం నర్సయ్య, జైడి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ రెండు శతాబ్దాలుగా నిజామాబాద్ రైతులు కొట్లాడి సాధించుకున్న పసుపు బోర్డు కేంద్రం నిజామాబాద్కు రావడం అందరికీ గర్వకారణం కాబట్టి బహిరంగ సభను ఘనంగా జరుపుకుందాం అని నిజామాబాద్ జిల్లాలోని అన్ని రైతు సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.