జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎర్రగడ్డ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ధన్యవాదాలు…..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎర్రగడ్డ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ధన్యవాదాలు
హైదరాబాద్/నిజామాబాద్ రూరల్, నవంబర్ 11 ( లోకంతీరు ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని 317, 318, 319, 320, 321, 362, 363, 364 బూత్‌లలో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రగడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ శ్రేణులకు అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చి ఎర్రగడ్డ డివిజన్లో బూత్ ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున శ్రమించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.మీ అందరి కృషి కాంగ్రెస్ పార్టీ విజయానికి బలమైన పునాది వేస్తుంది అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తెలిపారు.