Take a fresh look at your lifestyle.

లిఫ్ట్ పేరుతో దారుణం మహిళను హత్య చేసి బంగారం చోరీ….

0

లిఫ్ట్ పేరుతో దారుణం మహిళను హత్య చేసి బంగారం చోరీ

ఎడపల్లి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) :  మహారాష్ట్రకు చెందిన మహిళను దారుణంగా హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన ఎడపల్లి మండలంలో చోటుచేసుకుంది హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని ఒక ఆటోలో తరలిస్తూ ఉండగా గ్రామస్తులు పట్టుకొని నిందితుడిని ఎడపల్లి పోలీసులకు అప్పగించారు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కొండల్ వాడికి చెందిన శీలం వార్ లింగవ్వ(55) అనే మహిళ బతుకమ్మ పండుగ నిమిత్తం ఎడపల్లి మండలంలోని జమ్లంగ్రామానికి తన కూతురి ఇంటికి వచ్చింది ఈ క్రమంలో గత నెల 28 ఆమె ఎడపల్లి మండలంలోనిపోచారం గ్రామంలోనీ తన చెల్లి కొడుకు ఇంటికి వెళ్లడానికి దూపల్లి గేటు వద్దకు చేరుకుంది అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు ఈ సందర్భాన్ని అదునుగా తీసుకొని ఆ వ్యక్తి మహారాష్ట్రకు చెందిన లింగ అవ్వను బలంగా ఆయుధంతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు అనంతరం ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయాడు హత్య చేసిన తర్వాత ఆ దుండగుడు మృతదేహాన్ని జైతాపూర్ గ్రామ శివారులోని చెరుకు తోటలో పడేశాడు ఈ దారుణ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత గురువారం అర్ధరాత్రి సమయంలో జైతాపూర్ గ్రామానికి చెందిన పురుమేటి బాలకృష్ణ అనే వ్యక్తి ఆ మహిళ మృతదేహాన్ని తన ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు శవాన్ని గోనెసంచిలో చుట్టి ఉండడంతో అది పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది వెంటనే గ్రామస్తులు ఆటో డ్రైవర్ ను పట్టుకొని ఎడపల్లి పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ హత్య దొంగతనం కేసులో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.