Take a fresh look at your lifestyle.

నేడు అంబేద్కర్ వర్ధంతి ….

0

నేడు అంబేద్కర్ వర్ధంతి 

– డిసెంబర్ 6 అంబేద్కర్ ప్రత్యేకం 

కామారెడ్డి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : అంబేద్కర్ వర్ధంతి ప్రపంచంలోనే మేధావి వర్గంలో ఒకడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరోసారి   భారతదేశంలోని అణగారిన వర్గాలకు, బహుజనులకు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ వెనుకబడిన వర్గాలకు ఆ మహానుభావుడు చేసిన కృషిని సాగిస్తూ ..మరొకసారి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. చిన్నతనంలో చదువుకోవడానికి అనేక విధాలుగా అవమానాలకు గురై ప్రపంచంలోనే అత్యధికంగా డిగ్రీ పట్టాలు పొందినటువంటి ఉన్నత విద్యావంతుడు. భారతదేశ మూలవాసులకు  దిశా నిర్దేశం చేసిన మార్గదర్శకుడు, బహుభాష కోవిదుడు, భారతీయుల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించడానికి ప్రజాస్వామ్యమే సరైనదని నిర్ణయించి, ఏ ప్రభుత్వమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అందరికీ సమన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే భారత రాజ్యాంగం అనేటటువంటి ఒక గొప్ప కార్యాన్ని రచించడానికి అహర్నిశలు కృషిచేసి దేశంలోని అన్ని వర్గాలు ,అన్ని భాషలు వారికి సరియైన న్యాయం జరిగేటట్లుగా రాజ్యాంగ రచనను చేపట్టి భావితరాలు రాజకీయ పదవుల ద్వారానే తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, సామాజిక హోదాను, రాజకీయ పదవులను. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని చేర్చడం, నాయకులు  నోటు ద్వారా కాకుండా ఓటు ద్వారా ఎన్నిక కాబడాలని గట్టిగా నమ్మిన నాయకుడు. ఆ మహానుభావుడి కృషి వల్లనే నేడు సమాజంలో ఎంతో కొంత బహుజనులు తమ స్థితిగతులను మెరుగుపరుచుకోవడం జరిగింది .ఇంకా ఇప్పటికి చాలా జాతుల వారు, చాలా కులాల వారు రాజకీయ పదవులకు దూరంగా ఉంటూ, ఆర్థికంగా వెనుక బాటు కు  గురికావడం, సామాజికంగా, మానసికంగా, అంటరానివారుగా కొనసాగడం సిగ్గుచేటు .ఎప్పుడైతే భారతీయులమైన మేమంతా ఒకటేనని భావనతో, ఉన్నవాడు లేని వాడి గురించి ఆలోచించడం, చదువుకున్న ప్రతి వ్యక్తి తన తోటి సహచరునికి విద్యావంతుని చేయడానికి సంకల్పించడం, సొంత లాభం కొంత మానుకి పొరుగు వారికి సహాయపడినప్పుడు మహానుభావుడికి మనం అర్పించి నిజమైన నివాళి. జై అంబేద్కర్.

Leave A Reply

Your email address will not be published.