మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎడపల్లి, జనవరి 27 ( లోకంతీరు ) : బోధన్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని గదులు, రవాణా సౌకర్యాలు, పార్కింగ్ మరియు భద్రతా ఏర్పాట్లను సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణలతో కలిసి సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా, అన్ని వసతులు కల్పిస్తూ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రీ-పోలింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విట్టల్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.