Take a fresh look at your lifestyle.

బోధన్ నిజామాబాద్ రహదారిపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి……

0

బోధన్-నిజామాబాద్ రహదారిపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి

 ఎడపల్లి , డిసెంబర్ 17 ( లోకంతీరు ) :  బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారి ఎడపల్లి మండల పరిధిలోగల సాఠాపూర్ గేటు వద్ద ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని రాకపోకలు సాగించే వాహనదారులు పాదాచారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.ఉదయం 5 గంటల నుండి రాత్రి సుమారు 12 గంటల గంటల వరకు ఈ జాతీయ రహదారిపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.సాఠాపూర్ గేటు నుంచి ఏ ఆర్ పి క్యాంపు గ్రామానికి వెళ్లే రహదారి కూడా ఉంది. అలాగే వడ్డపల్లి గ్రామానికి వెళ్లేందుకు కూడా ఇదే మార్గాన రహదారి కూడా ఉంది. అటు వడ్డేపల్లి గ్రామస్తులు సా టాపూర్ గేట్ కు రావాలన్నా, ఇటు ఏ ఆర్ పి క్యాంపు గ్రామస్తులు సాఠాపూర్ గేటుకు రావాలన్నా, ప్రధాన రహదారి చౌరస్తా గామారింది. పట్టణ ప్రాంతాలకు పల్లె ప్రజలు పోవాలంటే ఇదే రహదారి నిజామాబాద్ నుండి బోధన్, బోధన్ నుంచి నిజామాబాద్ వైపు ద్విచక్ర వాహనాలు ,బస్సులు, లారీలు, ఇతర భారీ భారీ వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సాఠాపూర్ గేట్లో రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వలన చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతి వేగంతో బారి వాహనలు ఇసుక, మొరం టిప్పర్లు అతివేగంగా వెళ్లడంతో ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణాలను చేతిలో పెట్టుకొని తమ వానాలను నడిపేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఇదే గేట్లో చాలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. రోడ్ల భవనాల శాఖ అధికారులు చౌరస్తాలున్న చోట మారుమూల ప్రాంతాలకు వెలే రహదారుల వద్ద కూడా స్పీడు బ్రేకర్లనుఏర్పాటు చేసినట్లయితే ప్రమాదాలు నివారించవచ్చని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు బోధన్ నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పై చౌరస్తా ఉన్నచోట స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ప్రయాణి కులు కోరుతున్నారు. ఎడపల్లిలోని పాత బస్టాండ్ వద్ద, ఎడపల్లి మంగల్పా చౌరస్తా వద్ద, సాఠాపూర్ గేటు వద్ద, దూపల్లి గేటు వద్ద, జానకంపేట గాంధీ చౌక్ వద్ద, తప్పనిసరిగా స్పీడ్ బ్రేకర్లఅవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. అందుకు అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుం దంటున్నారు. అధికారులు ఇప్పుడైనా మేలుకోవాలని రాకపోకలు సాగించే ప్రయాణికులు

Leave A Reply

Your email address will not be published.