సీఎం కప్ వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకు కాకతీయ విద్యార్థిని

నిజామాబాద్ , ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) : నిజామాబాద్ కాకతీయ విద్య సంస్థ కు చెందిన సీఎచ్. శ్రీజ సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్టు డైరెక్టర్ సీఎచ్ రజినీకాంత్, సీఎచ్ తేజస్విని, ప్రిన్సిపాల్ నటరాజ్ తెలిపారు .ఈ నెల 20 నుండి 24 వరకు హైదరాబాద్ లో జరిగే పోటిల్లో పాల్గొననున్న శ్రీజ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కోఆర్డినేటర్ శ్రీలత,వాలీబాల్ కోచ్ సూరజ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.