ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో తొమ్మిది రోజుల్లో గణేష్ నిమజ్జనం

ఎడపల్లి, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లిమండలంలోని మంగల్ పహాడ్,కుర్నాపల్లి , జానకంపేట,తానాకలన్ ,జైతాపూర్, ఏఆర్పి క్యాంప్, ఆయా గ్రామాలలో గురువారం గణేష్ వినాయక నిమర్జనం కార్యక్రమాలను మండపాల నిర్వహకులతోపాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గురువారం సాయంత్రం వినాయకుల విగ్రహాలను గ్రామాలలోని ప్రధాన వీధులలో మండ పాల నిర్వాహకులు శోభయాత్రను నిర్వహించారుఆటపాటలతో యువకులు, మహిళలు, చిన్నారులు సందడి చేశారు.ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణాలు జరగకుండా ఎడపల్లి ఎస్సై ముత్యాల రమతో పాటు పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ జరిపారు. వినాయకుని నిమజ్జనం అయ్యంతవరకు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.