Take a fresh look at your lifestyle.

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి

0

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆర్డీవో భూజంగ్ రావు.

కోటగిరి ,జనవరి 21 (లోకం తీరు న్యూస్): ఓటరు జాబిత ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బిఎల్ ఓలు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని బాన్సువాడ ఆర్డీవో భూజంగ్ రావు ఆదేశించారు. ఆదివారం ఆయన బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి,పోతంగల్ మండలంలోని పలు గ్రామాల లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.ఈ సంద ర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ.పోలింగ్ కేంద్రంలో బి.ఎల్.ఓ.ల వద్ద ఓటరు జాబిత అవసరం మేర ఫారం-6,7,8 అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత,కొత్తగా ఓటరు నమోదుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి,పేరు మార్పు చేర్పులపై మార్పులు కోరుతూ ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు,వచ్చిన దరఖాస్తులను ఎప్పటిక ప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అనే వివ రాలు బి.ఎల్.ఒలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన ఓటర్లు,ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు,చిరునామా మారిన ఓటర్లు,చనిపోయిన ఓటర్ల పై ద్రుష్టి పెట్టాలని,ఓటరు జాబితాలో ఉన్న పేర్లను జాగ్రత్త గా పరిశీలించాలని ఆదేశించారు.వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ఓటర్ల విషయంలో పూర్తి జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు.ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఓటరు జాబితాలో తొలగింపులపై దృష్టి పెట్టి పూర్తి చేయాలనీ అన్నారు.ఆయన వెంట కోటగిరి, పోతంగల్ మండలాల తహసిల్దార్ లు ప్రభాకర్, రమేష్,ఆయా గ్రామాల బిఎల్వోలు,అధికారులు

1009

Leave A Reply

Your email address will not be published.