Take a fresh look at your lifestyle.

ఘనంగా అంబరీశ్వర ఉత్సవాలు..

0

ఘనంగా అంబరీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు

 

సదాశినగర్ ,జనవరి 25 (లోకం తీరు) : కామారెడ్డి జిల్లా  సదాశినగర్ మండలం బొంపల్లి గ్రామంలో ఘనంగా అంబరీశ్వర ఉత్సవాలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి శివుని అభిషేకం, కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంతే కాకుండా గుట్టపై ఉన్న శివాలయం ముందర భక్తులు హోమం నిర్వహించారు. గ్రామానికి చెందిన యువకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గుడిమెట్ మహాదేవుని పీఠాధిపతి శివుని ప్రవచనాలు వివరించారు. ఈ కార్యక్రమంకు ప్రత్యేకత ఉంది .34 సంవత్సరాల క్రితం యువకులు ఈ జాతరను ఏర్పాటు చేశారు.అప్పటినుంచి ఇప్పటి వరకు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఈ ఉత్సవాల లో శివకుమార్, ప్రవీణ్, నాగరాజు, రాజమౌళి, మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, పద్మాజివాడి సింగిల్ విండో చైర్మన్ గంగాధర్, ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, ఎస్ రమేష్ విట్టల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.