Take a fresh look at your lifestyle.

ప్రోగ్రెసివ్ జర్నలిస్టు అసోసియేషన్ జర్నలిస్టుల సమావేశం

0

ప్రోగ్రెసివ్ జర్నలిస్టు అసోసియేషన్ జర్నలిస్టుల సమావేశం

  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో

మెండోరా, జనవరి 28 ( లోకం తీరు ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడ్ లో జాతీయ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ జర్నలిస్టుల సమావేశం ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల అధ్యక్షులు ఉప్పు వీరాంజనేయులు గారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రోగ్రెస్ జర్నలిస్టు యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులకు ఇంతవరకు ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని,

వారి యొక్క బాధలను ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక శతమాతమవుతున్నారని తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరిగాయని వాటిని మేము వెంటనే అడ్డుకొని తీవ్రంగా ఖండించి ఎవరైతే దాడికి పాల్పడ్డారు వాడికి శిక్ష వేయించడం జరిగిందని అశోక్ గౌడ్ తెలియజేశారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జర్నలిస్టులకు ఫోర్త్ పిల్లర్ గా రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు స్వేచ్ఛకు ఉందని వారిని ఎవరు కూడా ప్రజా నాయకులే గాని అధికారులు గాని దూషిస్తే చట్టపరమైనటువంటి విధివిధానాలను తెలుసుకోవాలని లేదంటే తీవ్ర ఇబ్బందులు పాలు అవుతారని తెలియజేశారు.

అదేవిధంగా జర్నలిస్టులు పనిచేసే మండలం గాని నియోజకవర్గంలో గాని జిల్లాలో గాని వారికి తగిన వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.

మండల రిపోర్టర్లకు కనీసం వేతనం 10000 నియోజకవర్గ రిపోర్టర్లకు 15000 జిల్లా బ్యూరోలకు 25000 కచ్చితంగా చట్టంలో ఉందని దీన్ని అమలు చేయాలని అబ్బ గోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.

చిన్న చిన్న పేపర్లో గాని టాప్ పేపర్ లే గాని యూట్యూబ్ ఛానల్ లే గాని ఎవరైనా వాళ్లు కూడా రిపోర్టర్లకు ఇందుకే వస్తారు కాబట్టి వారికి కూడా సమన్వయ అవకాశాలు కల్పించాలని, వారి పట్ల చిన్నచూపు తగ్గదని ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు.

అదేవిధంగా హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత, జర్నలిస్టుల ప్లాట్లను తక్షణమే ఇవ్వాలని తెలిపారు.

జాతీయ అధ్యక్షులు ఉప్పు వీరాంజనేయులు మరియు రాష్ట్ర ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నూతన కమిటీ వేయడం జరిగిందని తెలిపారు.

ఈ కమిటీలో నిజామబాద్ ప్రోగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా హరికృష్ణ, నిజామబాద్ జిల్లా ప్రోగ్రాం కార్యదర్శిగా ముత్యం యాదవ్, నిజామాబాద్ ప్రోగ్రెసివ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జితేందర్, ఆర్గనైజర్ సెక్రెటరీగా వంశీ, సెక్రెటరీగా బోదాస్ రాజలింగం మరియు వీరితోపాటు పాత కమిటీ మెంబర్స్ కూడా యధావిధిగా వారి స్థానంలో ఎన్నికయ్యారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంపల చెన్నకేశవరావు మరియు రాష్ట్ర కమిటీ మెంబర్స్, జిల్లా కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.