పట్టభద్రుల ఓటర్ నమోదుకు మళ్లీ అవకాశం

ఎడపల్లి, నవంబర్ 23 ( లోకంతీరు) : ఎడపల్లి. గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకులు కందగట్ల రామ్ చందర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ నమోదు కొరకై డిగ్రీ పాసైన యువతీ యువకులునమోదు చేసుకోవాలని మరో అవకాశం కలిపించిందని నాయకులు కందగట్ల రామచందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 23 వ తారీకు చివరి తేదీ ఉండగా ప్రభుత్వం ఓటర్ నమోదు కొరకై డిసెంబర్ 9వ తేదీ వరకు పొడిగించిందని ఆయన తెలిపారు.డిగ్రీ పాసైన యువతి యువకులుఓటర్ నమోదుగా చేసుకోవాలని ఆయన కోరారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే. మీ ఓటు హక్కు నమోదు కి(9866960765) వాట్సప్ చేయండి.