తుది ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్..
రాజకీయ పార్టీల… ప్రతినిధులకు అందజేత.

నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ జాబితాను విడుదల చేసి, వారికి తుది ఓటరు జాబితాను అందజేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 1406785 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 85 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లు ఉన్నారని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. 664238 మంది పురుష ఓటర్లు ఉండగా, 742475 మంది మహిళా ఓటర్లు, 72 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. 85 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లలో 76 మంది పురుషులు, 9 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే, ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 98116 పురుష ఓటర్లు, 112612 మహిళా ఓటర్లు, ఆరుగురు ఇతరులు, 9 మంది ఎన్.ఆర్.ఐలను కలుపుకుని మొత్తం 210734 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. బోధన్ శాసనసభా నియోజకవర్గం పరిధిలో 105609 మంది పురుష, 115701 మహిళా ఓటర్లు, నలుగురు ఇతరులు, 13 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లు కలుపుకుని మొత్తం 221314 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో 93266 పురుష, 102415 మంది మహిళలు, 13 మంది ఇతరులు, ఐదుగురు ఎన్.ఆర్.ఐలు కలుపుకుని 195694 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ పరిధిలో 144645 మంది పురుష ఓటర్లు, 154961 మంది మహిళా ఓటర్లు, 41 మంది ఇతర ఓటర్లు, 9 మంది ఎన్.ఆర్.ఐలు కలుపుకుని మొత్తం 299647 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో 118607 మంది పురుష ఓటర్లు, 135523 మంది మహిళా ఓటర్లు, ఆరుగురు ఇతరులు, 19 మంది ఎన్.ఆర్.ఐలను కలుపుకుని మొత్తం 254136 మంది ఓటర్లు ఉన్నారని సూచించారు. అలాగే బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలో 103995 మంది పురుష ఓటర్లు, 121263 మహిళా ఓటర్లు, ఇతరులు ఇద్దరు, 30 మంది ఎన్.ఆర్.ఐలను కలుపుకుని మొత్తం 225260 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఎస్.ఎస్.ఆర్ – 2024 కార్యక్రమంలో భాగంగా జనవరి 22 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందించడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారుల వద్ద, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే తహశీల్దార్ కార్యాలయాలలో, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటరు జాబితా విడుదల కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, విజయేందర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.