Take a fresh look at your lifestyle.

స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్…..

0

స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్

తృటిలో తప్పిన ప్రమాదం….

ఎడపల్లి, జనవరి 31( లోకంతీరు ) :  నవీపేట్ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ ఏరియా సమీపంలో ఆదర్శ స్కూల్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది విద్యార్థులు ఉండటంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే, విద్యార్థులందరినీ సురక్షితంగా బస్సు కిందకు దింపడంతో పెను ముప్పు తప్పింది. ఫిట్‌నెస్ లేని బస్సులను రోడ్లపైకి అనుమతించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.