Take a fresh look at your lifestyle.

రోడ్డు పై ప్రమాదకర గుంత పూడ్చి వేత…

0

రోడ్డు పై ప్రమాదకర గుంత పూడ్చి వేత

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 21 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండలంలోని బట్టపూర్, వెల్కటూర్ గ్రామాల మధ్య రోడ్డుకు గల కల్వర్టు పక్కన ప్రమాదకరంగ ఏర్పడిన గుంతను బట్టాపూర్ కు చెందిన పలువురు యువకులు ఆదివారం పూడ్చి వేశారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ తమ గ్రామ శివారులో రామాలయం వద్ద ఉన్న కల్వర్టు ప్రక్కన రోడ్డుకు ఇటీవల ప్రమాదకర గుంత ఏర్పడటంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని గుంతను పూడ్చివేసినట్లు వారు తెలిపారు, దీనితో గ్రామస్థులు వారిని అభినందించారు,గుంతను పూడ్చిన వారిలో, దయానంద్, భాషణవేణి గంగాధర్ యాదవ్,నర్సయ్య యాదవ్, అశోక్,కండేలా భూమేష్,మనోజ్, రమేష్ గౌడ్,ఇమామ్,నూకల గంగాధర్,కాటిపల్లి సాగర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.