బాల త్రిపుర సుందరి దేవి ఆలయ నూతన కమిటీ నియామకo
ఎడపల్లి , ఆగస్టు 29 ( లోకం తీరు ) : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయ నూతన కమిటీని శుక్రవారం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బిల్లా రామ్మోహన్, అధ్యక్షులుగా నార్ల గోవర్ధన్ గుప్తా, ఉపాధ్యక్షులుగా మాణిక్యాల సురేష్ గౌడ్, చేపూర్ నగేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సుప్పాల భూషణ్, కోశాధికారిగా జక్కల్ ప్రవీణ్, కార్యదర్శిగా గవ్వల అశోక్, సలహాదారులుగా చిట్యాల నరేందర్, గూప గంగాధర్, దేగం గణేష్, మచ్చ రాములు, సాయిలు, మంగలి లక్ష్మణ్, గాంధారి లచ్చా రెడ్డి, కుమ్మరి లింగo,ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ మాట్లాడారు.నూతనంగా ఎంపికైన శ్రీ శ్రీ త్రిపుర బాల సుందరి దేవి ఆలయ నూతన కమిటీ పాలకవర్గంతో పాటు, గ్రామస్తులు, విద్యావంతులు, యువకులు,పెద్దలు ఆలయ అభివృద్ధికి తోడ్పాటు, తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.