41వ డివిజన్ లో కాంగ్రెస్ ప్రచారం
స్వాగతిస్తున్న ఓటర్లు..


నిజామాబాద్ ఫిబ్రవరి 07 (లోకంతీరు) : నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో కాంగ్రెస్ ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటుంది.నగరంలోని 41 వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పూజిత ప్రవీణ్ గౌడ్ కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఓటరుకు ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలు తెలుసుకుంటున్నారు.అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని డివిజన్ అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా అభివృద్ధి పరుచుకుందాం అన్నారు. ఒకసారి అవకాశం కల్పించాలని చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.