సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31( లోకంతీరు ) : ముప్కాల్ మండల కేంద్రంలో రైతు రుణమాఫీ రూ.లక్ష యాభై వేల రూపాయలలోపు నేరుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ టౌన్ ఇంచార్జ్ ముస్కు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉదయం ముప్కాల్ మండల కేంద్రంలోని ‘ఎస్సి కాలనీ’లో లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి అట్టి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలేటి రాములు, కొమ్ముల శ్రీనివాస్, ముస్కు ముత్తెన్న, ప్రశాంత్, మల్లారెడ్డి, కట్ట గోపి, సదా, గద్దల గంగాధర్, లాలయ్య, లబ్ధిదారులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.