ప్రైవేట్ పాఠశాలలు పదవ తరగతి ఫీజు అధిక మొత్తంలో వసూలు
– ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫీజు 125 రూపాయలు
– ప్రైవేట్ పాఠశాలలో 1000 నుంచి 2000 వసూలు

ఎడపల్లి, నవంబర్ 13 ( లోకంతీరు ) : తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్ష ఫీజు విషయంపై బోధన్ ఎం ఈ ఓ కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ అధ్యక్షులు నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదవ తరగతి పరీక్ష ఫీజు125 రూపాయలు మాత్రమే కానీ ప్రవేట్ పాఠశాలలో 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయన్నారు అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొని వారి తల్లిదండ్రులకు మిగతా డబ్బులు రిఫండ్ చేయాలని అలాంటి పాఠశాలల పై చర్య తీసుకొవాలని అన్నారు.