Take a fresh look at your lifestyle.

పాస్పోర్ట్ కార్యాలయం షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం….

0

పాస్పోర్ట్ కార్యాలయం షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం

— ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం

— ఏ ఒక్క డాటా కూడా మిస్ కాలేదు..!

— డేటా సేఫ్ గా ఉందని తెలిపిన సిబ్బంది

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ పాస్పోర్ట్ కార్యాలయం శనివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్ధమైందనీ పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరిండెంట్ జనార్దన్ రెడ్డి తెలిపారు. పాస్పోర్ట్ కార్యాలయం ఫిబ్రవరి 20, 2019 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యాలయంలో గల సిస్టమ్స్, యుపిఎస్, బ్యాటరీలు, ప్రింటర్స్, కుర్చీలు, పేపర్స్ తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమైనాయి అన్నారు. ఉదయం ఏడున్నర గంటలకు పాస్పోర్ట్ కార్యాలయం నుండి పొగలు రావడంతో అక్కడే ఉన్న వాచ్మెన్ అప్రమత్తమై మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూడగా మంటలు రావడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పూర్తిగా దగ్ధమైపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తేవడంతో చుట్టూ పక్క గదులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, అందులోనే ఫైలు భద్రంగా ఉన్నాయని సూపర్డెంట్ తెలిపారు. పాస్పోర్ట్లకు సంబంధించి ఏ ఒక్క డాటా మిస్ కాలేదని, తమ వద్ద ఎవరి ఫైలు ఉంచుకోమని అభ్యర్థి ఉండగానే వారి పాస్పోర్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసి, అతని ఫైల్ అతనికి ఇవ్వడం జరుగుతుంది. అని, ఆన్లైన్ చేసిన సమాచారాన్ని హైదరాబాద్ కార్యాలయానికి పంపించడం జరుగుతుందని కంప్యూటర్ సిబ్బంది పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.