గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితుడి ఫిర్యాదు

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 8(లోకంతీరు): గల్ఫ్ బాధితుడు గడ్డం మహేష్ (33) కులం మాదిగ, కూలి అక్కాపూర్ గ్రామం, జనవరి 2022 లో బ్రతుకు తెరువు కొరకు విదేశాలకు వెళదామని తెలిసిన వ్యక్తుల ద్వారా ఏజెంట్ లక్ష్మణ్ మరియు దుర్గాప్రసాద్ లను సంప్రదించగా అట్టి వ్యక్తులు మలేషియా కి వీసా ఇస్తామని, అక్కడ రోజుకు 10 గంటల డ్యూటీ, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీ నందు డ్యూటీ ఇస్తామని మహేష్ దగ్గర 1,20,000/- తీసుకొని వారు మహేష్ కి టూరిస్ట్ వీసా ఇచ్చి 02/05/2022 మలేషియాకి పంపించినారు. మలేషియాలో మహేష్ ని లక్ష్మణ్ మరియు అమన్ అనే వ్యక్తులు రిసీవ్ చేసుకుని అక్కడ ఒక కంపెనీలో పనికి పెట్టించి రెండు నెలల 15 రోజులు పని చేసిన తర్వాత కూడా జీతం డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుంటే మహేష్ మలేషియాలోని ఇండియాకి చెందిన ఇండియన్ మెంబర్స్ ఆఫ్ ఇండియా నీ ఆశ్రయించగా వారు 27/05/2023 మలేషియా నుండి ఇండియాకి మహేష్ ని తిరిగి పంపించినారు. కావున తనను మోసం చేసిన ఏజెంట్ లక్ష్మణ్ రాఘవపురం దుర్గాప్రసాద్ మరియు అమీన్ లపై చట్టరీత్యా చర్య తీసుకోవలననీ దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన స్థానిక ఎస్సై తెలపడం జరిగింది.