Take a fresh look at your lifestyle.

అత్యవసర సమయంలో ప్లేట్లెట్స్ దానం చేసిన యువకుడు…

0

అత్యవసర సమయంలో ప్లేట్లెట్స్ దానం చేసిన యువకుడు

 – జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్,ముదాం శ్రీధర్ పటేల్

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 14 (లోకంతీరు) : కామారెడ్డి పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్న మౌనిక అనే పేషంట్ కి బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన అయిలాపూర్ గ్రామనికి చెందిన మద్దికుంట మహేష్ గౌడ్ ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే హుటాహుటిన వచ్చి ప్లేట్లెట్స్ అందించారు.

ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ, రక్తం అందక పోయిన ప్రాణం తిరిగి రాదు. మనం చేసే రక్తదానం వలన వెలకట్టలేని విలువైన ప్రాణం రక్షించబడుతుంది.యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలిపారు.ఈ సందర్బంగా ఫోన్ కాల్ చేయగానే వచ్చి ప్లేట్లెట్స్ దానం చేసిన మహేష్ గౌడ్ కి జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధి మ్యాన రంజిత్ కుమార్, పేషంట్ కుటుంబసభ్యులు, కె బి ఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.