అక్రమ మొరం రవాణా చేస్తున్న టిప్పర్ ను, టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిజామాబాద్, పిబ్రవరి 12 ( లోకంతీరు ) : ఈ రోజు నిజామాబాదు 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా అక్రమంగా మొరం ను రవాణా చేస్తున్న TS16UB1909 నెంబర్ గల టిప్పర్ ను, టిప్పర్ డ్రైవర్ ఎత్తరి చిన్న కొండయ్య(44) యెల్లయ్య , నివాసము గాంధీ నగర్ ,నిజామాబాద్ అదేవిధంగా టిప్పర్ యజమాని బొల్లమ్ నర్సయ్య ( 56) s/o గంగారామ్ , నివాసము మల్లారం , నిజామాబాద్ లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు పరిచి అట్టి టిప్పర్ వాహనం ని కూడా సీజ్ చేయడం జరిగింది. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారయిన మక్కల గోపాల్ నివాసము నాగారం, నిజామాబాద్, దండ్ల సాయికుమార్ నివాసము నాగారం, నిజామాబాద్, మమ్మాయి అరుణ్, నివాసము మల్లారం , నిజామాబాద్ మరియు బొల్లమ్ నర్సయ్య నివాసము మల్లారం ,నిజామాబాద్ లను తిరిగి ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండుటకు గాను తహసీల్దార్, సౌత్ మండల్ , నిజామాబాద్ ముందర హాజరు పర్చగ తహసీల్దార్ ఈరోజు వారికి 5,00,000/- రూపాయలు పూచికత్తు తీస్కోని ఒక సంవత్సరo కాల పరిమితి తో బైండోవర్ చేయటం జరిగింది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడినచో వారిపై చట్టరీత్యా కేసు నమోదు పరచి అట్టి వాహనం ను సీజ్ చేయటం జరుగుతుంది అని టౌన్ 5 సబ్- ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీన్ ఎం. గంగాధర్ గారు తెలిపినారు.