Take a fresh look at your lifestyle.

సీనయ్య బృందం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం….

0

సీనయ్య బృందం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం

– సీనయ్య గుండె మీదేనయ్య బృందం

ఎడపల్లి, డిసెంబర్ 26 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్ పహాడ్ చౌరస్తా వద్ద ఎడపల్లి, కుర్నపల్లి, వడ్డేపల్లి గ్రామాలకు వెళ్లి ఆటో రిక్షాల ఆటో స్టాండ్ లేకపోవడం అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆ సమస్య తమ దృష్టికి వచ్చిందని తక్షణమే పాలకవర్గంతో పాటు తాను కూడా సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ అన్నారు. శుక్రవారం ఎడపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచ్ లతోపాటు పాలకవర్గాన్ని స్థానిక ఎడపల్లి గ్రామంలోని జయం యూత్ ఆధ్వర్యంలో సంగేమ్ శ్రీనివాస్ (సీనయ్య) బృందం ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి సన్మానించిన అనంతరం పూలబో క్కెను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. సంగేమ్ శ్రీనివాస్ (సీనయ్య గుండె నీదేనయ్యా) సినీ ఫ్రేమ్ బృందం ఒకటి రెండు సమస్యలు తమ దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ అన్నారు. ఆటో డ్రైవర్ ఆటో లను ఆపుకునేందుకు గ్రామాలకు వెళ్లే ఆటోలకు స్టాండ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అటు మంగల్పహాడ్ కు, ఇటు వడ్డపల్లికి, స్థానిక ఎడపల్లి ఆటో డ్రైవర్ల కొరకు ఆటో స్టాండ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.ఈ విషయాన్ని కూడా స్థానిక ఎడపల్లి ఎస్సై ముత్యాల రమను కలిసి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. అలాగే గ్రామంలో పిచ్చికుక్కల బెడద అధికంగా ఉన్నందున ఊర కుక్కల బెడద నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మంగళవారం జరిగే వారంతో సంతలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో సంతకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కాకుండా మౌలిక సౌకర్యాలతో పాటు వసతులను కల్పించేందుకు స్థానిక ఎడపల్లి ఎంపీడీవోను సంప్రదించి సమస్యను విన్నవిస్తామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ దృష్టికి అరవింద్ తీసుకెళ్లి నిధుల మంజూరు కొరకు కృషి చేస్తామని అన్నారు. నిధులు మంజూరైనట్లయితే పైన పేర్కొన్న సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు తాను కూడా అభివృద్ధికి పాటుపడతారని కందగట్ల రామ్ చందర్ అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పాలకవర్గం స్థానిక యువకులు సంఘం శ్రీనివాసును సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మచికూరు గంగాధర్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, జయం యూత్ సభ్యులు, సంగేమ్ శ్రీనివాస్ (సీనయ్య), వినోద్, రాజశేఖర్,, రాజేష్, శివ, రంజిత్, విజయ్, ప్రశాంత్ లతోపాటు భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్,, ధ్యాకం సాయి రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.