ఎడపల్లి మండలంలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు
– సాఠాపూర్ గేటు వద్ద రక్తదానం శిబిరంలో పాల్గొన్న నాయకులు
ఎడపల్లి, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : ఏడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు.ఎడపల్లి మండల భాజపా శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని సాటాపూర్ గేటు వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అంతకముందు నాయకులు కేక్ కట్ చేశారు.ఆయాగ్రామాల పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు బీజేవైఎం నాయకులు.కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.ఈసందర్భంగా భాజపా మడలఅధ్యక్షులు కోలఇంద్రకరణ్ తోపాటు మీడియా కన్వీనర్ కూరెల్ల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానంలో నిలపడం యావత్ భారతదేశానికే గర్వకారణమని నాయకులు అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందు ఉంచడం ఆఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందన్నారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల బాజాపా నాయకులు, కార్యకర్తలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.