Take a fresh look at your lifestyle.

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుక్కల….

0

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుక్కల


ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుక్కలను నియమించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వాడు అధ్యక్షులు ప్రశాంత్ కుక్కల మాట్లాడుతూ… తనపై నమ్మకంతో వార్డు అధ్యక్షునిగా బాధ్యత అప్పగించిన ఎమ్మెల్యే మదన్మోహన్ కు, తమకు సహకరించిన పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.