వినూత్న ప్రచారం
– అభ్యర్థి జీరి గారి రాజు

రామారెడ్డి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : రామారెడ్డి కేంద్రంలో 1వార్డ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి గిరిగారి రాజు వినూత్న రీతిలో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మృదుస్వభావంతో సైకిల్ పై గ్యాస్ స్టవ్ గుర్తును బిగించి ప్రచారంలో కొత్తదనాన్ని సృష్టించడం తో ప్రజలలో వినూత్న ఆదరణ లభిస్తుంది. తాను మాట్లాడుతూ అహర్నిశలు గ్రామాభివృద్ధి కొరకు గాని వార్డు అభివృద్ధి కొరకు గాని 24 గంటలు సేవ చేయడానికి ముందుకు వచ్చానని అదేవిధంగా గత 25 సంవత్సరాల నుండి కట్టుబడి ఒకే పార్టీకి సేవ చేసిన సిద్ధాంతం కలిగి ఉన్న వ్యక్తిని కనుక వార్డు సభ్యులు ఈ విషయంపై స్పందించి మంచి ఆదరణతో మీ అమూల్యమైన ఓటును గ్యాస్ స్టవ్ పై వేసి గెలిపించగలరని జిరిగారి రాజు కోవడం జరిగింది.