జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్ ఆధ్వర్యంలో తల్లి సావిత్రిబాయి పూలే196 జయంతి

ఎడపల్లి, జనవరి 04 ( లోకంతీరు) : ఎడపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి(MRPS ) జిల్లా అధ్యక్షుడు శ్రీ డల్లా సురేష్ మాదిగ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 196 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూల వేసిన అనంతరం శ్రీ డల్లా సురేష్ మాదిగ మరియు బుడ్డ పోశెట్టి సంయుక్తంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీ డల్లా సురేష్ మాదిగ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లా నాయిగావ్ అనే గ్రామంలో 1931 జనవరి 3న జన్మించినారు ,మహాత్మ జ్యోతిరావు పూలే ని వివాహం చేసుకున్నారు జ్యోతిరావు పూలే సహకారంతో చదువుకొని సమాజంలోని మహిళలందకి కూడా చదువు నేర్పించిన ఘనత మహాత్మ సావిత్రి భాయి పూలే కి చెందుతుంది. ఈ దేశంలో చదువు నిరాకరించిన సమయంలో చదువుకోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల అందరికీ విద్యను అందించిన ఘనత మహాత్మ పూలే దంపతులదని అదే సమయంలో మనువాదులు ఎన్ని కుట్రలు చేసినా నిర్భయంగా చదువు నేర్పించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి అయిపోలే చదువుతోపాటు మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడి మహిళలను చైతన్యం చేసిన ఘనత సావిత్రిబాయి పూలే గారికి ఈ దేశంలో దక్కుతుందని కావున మహిళలందరూ సాయత్రివైపులే ఆశల కోసం ముందుకు కదలాలని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ మహాత్మ పూలే దంపతులను ఆదర్శ దంపతులుగా భావిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఈ దేశంలో విద్యను నిరాకరించిన బ్రాహ్మణీయ వ్యవస్థను దాటుకొని వచ్చి మనందరికీ విద్య నేర్పించిన మహాత్మ పూలే దంపతుల యొక్క జయంతులను ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించాలని అదే సమయంలో సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బుడ్డా పోశెట్టి, కాశిగోళ్ళ లక్ష్మణ్ ,ఎర్ర శేఖర్, ఏఆర్పి సాయికుమార్, పి సాయి చిరు అజయ్, కర్రోల గంగారం, బొప్పురం అబ్బాయ్య మాదిగ, బాన మోహన్, అంబేద్కర్ సంఘం సభ్యులు ఏనుగు శ్రీనివాస్, మొద్దోళ్ల చిన్ని గంగారం, బిసి నాయకులు కళ్యాణ్ గౌడ్ చాకలి శేఖర్ ,చాకలి చిన్న ,ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు