Take a fresh look at your lifestyle.

ముప్కాల్ లో షార్ట్ సాక్యూట్….

0

ముప్కాల్ లో షార్ట్ సాక్యూట్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  అక్టోబర్ 15 ( లోకంతీరు ) : ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో పలు వ్యాపార సముదాయాలు, గృహ నివాసలలో భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని అట్టి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద పలు ఇండ్లల్లో టెలివిజన్ లు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరెటర్లతో పాటు దుకాణాలలో ఇతరత్రా వస్తువులు సైతం భారీ మొత్తంలో నష్టపోయినట్లు యజమానులు తెలిపారు. శ్రీరామ సానిటరీ షాప్ లో దాదాపు రూ.60 వేల రూపాయల విలువైన వస్తువులు నష్టానికి గురైనట్లు షాప్ యజమాని సుశీల్ పవర్ ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.