అంబం గ్రామంలో మోతిబిందు పరీక్షలు

ఎడపల్లి, నవంబర్ 23( లోకంతీరు): ఎడపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎడపల్లిమండలంలోని అంబం గ్రామంలో కంటి వైద్య, డయాబెటిక్ క్యాంపు నిర్వహించడం జరిగింది.98 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 22 మందికి మో తి బిందు ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రిలో ఉచిత శాస్త్ర చికిత్సలు చేస్తారు.62 మందికి పరీక్షలు డయాబెటిక్ నిర్వహించగా 20 మందికి చక్కెర వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. వారికి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోజ్ కుమార్, ప్రతినిధులు కదం ప్రకాష్ రావు, మెర్సి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.