అహర్నిశలు శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది
![]()
– భారీ వర్షంలో సైతం విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా పునరుద్ధరణ పనులు.
– నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశంసించిన సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 29 ( లోకంతీరు ) : నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టి.జి. ఎన్.పి.డి.సి.ఎల్ ) పరిధిలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమతంగా ఉంటూ ఎక్కడ విద్యుత్ అంతరాయలు లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారని, భారీ వర్షంలో సైతం వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నారని టి.జి. ఎన్.పి.డి.సి.ఎల్ సీ.ఎం.డి. కర్నాటి వరుణ్ రెడ్డి గారు స్పష్టం చేశారు . ఈ సందర్భాంగా సీ.ఎం.డి. మాట్లాడుతూ కామారెడ్డి , ఆదిలాబాద్ , నిర్మల్ , నిజామాబాద్ సర్కిల్ పరిధిలో నేలకూలిన 108 విద్యుత్ స్తంభాలలో 87 పునరుద్దరించామని , దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు 21 ఉండగా అందులో 17 సరిచేశామని చెప్పారు . నీటిలో మునిగిన ట్రాన్స్ఫార్మర్లు 86 కాగా , అందులో 6 పునరుద్దరించామని అన్నారు . భారీ వరద ముంపు చేరడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని , కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించడానికి బ్రేక్ డౌన్ టీం సిద్ధంగా ఉన్నారని , రేయింబవలు నిబ్బద్దత్థో పనిచేస్తున్నామని విద్యుత్ సిబ్బంది పండుగ రోజు అయినా వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వివరించారు. కరీంనగర్ , జగిత్యాల , నిజామాబాదు ప్రాంతాలలో సీ.ఎం.డి. కర్నాటి వరుణ్ రెడ్డి పర్యటించారు . అందులో భాగంగా కరీంనగర్ సర్కిల్ ఆఫీసులో లోడ్ మానిటరింగ్ సెల్ ( కంట్రోల్ రూమ్ ) ను పరిశీలించారు. వర్షాల వలన విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల పనితీరు, స్తంభాల మరియు లైన్లు యొక్క పనితీరు మరియు స్థితిగతులను తనిఖీ చేసినారు. వర్షాల వలన ఎలాంటి విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా భద్రత జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినారు. వర్షాల వలన ఎలాంటి ఇబ్బంది రాకుండా సంబంధిత అధికారులు ఉద్యోగులు నిరంతరం సబ్ స్టేషన్ లు, ట్రాన్స్ఫార్మర్లు లైన్లో స్తంభాలను పర్యవేక్షించాలన్నారు. ఏ ఒక్క ఉద్యోగి సెలవుపై వెళ్లరాదని ఆదేశించినారు. అనంతరం జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీ.ఎం.డి. కర్నాటి వరుణ్ రెడ్డి పర్యటించారు , జిల్లాలో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినటువంటి జగన్నాథపురం, బోర్నపల్లే గ్రామాల్లో విస్తృత పర్యటన చేసి విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశించారు.
ఈ భారి వర్షాల కారణంగా జిల్లాలోని ప్రతి ఉద్యోగి హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఎటువంటి విద్యుత్ అంతరాయం జరిగిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. తదనంతరం నిజామాబాద్ జిల్లా లోని డిచ్‌పల్లి డివిజన్‌లోని డిచ్‌పల్లి 220/132 కెవి సబ్ స్టేషన్ ను సందర్శించారు . అలాగే ఇందల్వాయి సెక్షన్‌లోని గన్నారం సబ్‌స్టేషన్ ను సందర్శించి భారీ వర్షాల వేళ, పండుగ పర్వదినాన కూడా మొత్తం విద్యుత్ అధికారులు సిబ్బంది పని చేస్తున్నారని అభినందించారు . ఎక్కడ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నారని వివరించారు . వాగులు దాటుకుంటూ వెళ్లి మరి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారని స్పష్టం చేశారు . నిబ్బదత్థో విద్యుత్ సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారని వివరించారు
