Take a fresh look at your lifestyle.

ఉత్తం భలేరావు ను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి….

0

ఉత్తం భలేరావు ను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

బైంసా, నవంబర్ 19 ( లోకంతీరు ) : “నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ అవార్డు”ను తానూర్ మండల మాజీ జడ్పీటీసీ భోసి గ్రామానికి చెందిన ఉత్తమ్ బాలేరావును అందుకున్న శుభ సందర్భంలో భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని భోసి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు కు విశాఖపట్నంలోని డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ స్వచ్చంద సేవా సంస్థ ప్రతియేట వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి జాతీయ స్థాయిలో సేవా అవార్డులను ప్రదానం చేస్తుందని ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా విద్య, సైన్సు,సాహిత్యం , సామాజిక సేవా రంగాల్లో కృషి చేస్తున్న వారి సేవలను గుర్తిస్తూ వివిధ రకాల అవార్డులతో సన్మానిస్తారన్నారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాస్ చంద్రబోస్ జాతీయ అవార్డు ను విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయ ఏసీ ఆడిటోరియంలో స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ చిన్నరావు,డాక్టర్ అలపాటి లక్ష్మీనారాయణ , డాక్టర్ దాడి సత్యనారాయణ గ (విశాఖపట్నం మాజీ మేయర్) చేతుల మీదుగా తానూర్ మాజీ జడ్పీటీసీ ఉత్తం భలే రావు కు “నేతాజీ సుభాష్ చంద్రబోస్” జాతీయ అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.ఉత్తం బాలే రావు రాజకీయాలలో ఉంటూ నిస్వార్ధమైన సేవలు చేస్తూ వెనుకబడిన వర్గాల వారికి,కులము,మతము అని భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ ఆపన్న హస్తం అందించే సహృదయుడు అని కొనియాడారు. విద్యార్థులకు అన్నగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ అవసరాలను గుర్తించి వాటిని తీర్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తారని. అలాగే అనేక భక్తి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారన్నారు. ముఖ్యంగా భోసి గ్రామంలో శ్రీ మహాదేవుని మందిరానికి దాతలు, గ్రామస్తుల సాయంతో ఆయన ఒక దివ్యమైన,భవ్యమైన మందిరాన్ని నిర్మించి అందరికీ మార్గదర్శనంగా నిలిచారన్నారు. ఈయన చేసినటువంటి సేవలకు గుర్తుగా గతంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో “కీర్తి చక్ర అవార్డు “ను కూడా అందుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయస్థాయి అవార్డు అందుకోవడం అది మన ప్రాంతం వాడు కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. ఉత్తం బాలే రావు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు.తదనంతరం గ్రామస్తులు,మండల వాసులు, ముధోల్ నియోజకవర్గం ప్రజలు ఉత్తం బాలే రావు అభినందించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్,మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అరుణ్ కుమార్,మాజీ ఎంపిటిసి పోశెట్టి,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భైంసా మేకల దేవదాస్, మౌల ఖాన్ , బొడ్డోళ్ళ శ్రీనివాస్, గైక్వాడ్ సాయినాథ్ ఝరి నయీం తదితరులు పాల్గొని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.