మానవసేవే మాధవసేవ
నిజామాబాద్ అర్బన్ 18 ( లోకంతీరు ) : మానవ సేవయే మాదవుని సేవని నిజామాబాద్ ఆర్డీఓ కె.రాజేంద్రకుమార్ అన్నారు.నిజామాబాద్ నగరంలోని వాగ్దేవీ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆద్వర్యంలో శనివారం 10మంది మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆర్డీఓ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి మనిషిలో దాతృత్వ గుణం ఉండాలని అన్నారు.సమాజం మనకేం ఇస్తుందో అని కాకుండా సమాజానికి మనమేమిస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. మహిళలకు కుట్టుమిషన్లు అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ సభ్యులను ఆర్డీఓ అభినందించారు..మహిళలు మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అద్యక్ష కార్యదర్శులు పద్మ శ్రీనివాస్,గౌరీ శంకర్,పూర్వాద్యక్షులు సూర్యప్రకాష్,ప్రోగ్రామ్ చైర్మెన్ రాంప్రసాద్ సభ్యులు చంద్రశేఖర్ రంజిత్ సింగ్ శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.