ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి
నిజామాబాద్ అర్బన్ జనవరి 21(లోకంతీరు) : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీ ప్రతిష్టత్మకమైన ప్రజా పాలనలో భాగంగా మంగళవారం సభలు, వార్డ్, డివిజన్ సభలలో భాగంగా అధికారులు దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన శ్రద్ధానంద్ గంజ్ లోనీ మార్చంట్ అసోసియేషన్ వద్ద, న్యాలకల్ రోడ్ లో గల నలాందా స్కూల్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సభలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ కోనేరు కోనేరు సాయికుకుమార్,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆదే ప్రవీణ్ కుమార్, ఈర్ల శేఖర్, పాశకంటి మహేష్ లు సభలను సందర్శించి రేషన్ కార్డు లేని వారు ఈ ప్రజాపాలనలో దరఖాస్తూ చేసుకోవాలని,ఖాళీ స్థలం వుండి ఇండ్లు లేని పేదవాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనీ, ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసిన వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ భరోసా కోసం దరఖాస్తూ చేసుకోవాలని ఈ సభలు ప్రతీ గ్రామ, వార్డ్, డివిజన్ లలో ఈ నెల 24 వరకు జరిగే వాటిలో అర్హులైన ప్రజలందరు దరఖాస్తులు చేసుకునే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ వారు ఈ సందర్బంగా అన్ని డివిజన్ ల ప్రజలను కోరారు.