పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలి.
- జడ్పీహెచ్ఎస్ కోటగిరి పాఠశాలను పరిశీలించిన, కొట్టం మనోహర్

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 5 ( లోకం తీరు న్యూస్) : నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీసిసి డెలిగేట్ సభ్యులు కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతు లను మెరుగుపరచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ కు ఆయన సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గానికి పది కోట్ల నిధులను మంజూరు చేశారని ఆయన తెలిపారు.కోటగిరి పాఠశాలలో మాలిక వసతుల మెరుగుదలకై అనగా మరుగుదొడ్లు,త్రాగు నీరు,పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు ఈ నిధులు కేటాయించడం జరుగు తుందని అన్నారు.అందుకు గాను మౌలిక సదుపాయాల మెరుగుదలకై సంబంధించిన ఎస్టిమేషన్ వేయడం జరుగిందని ఆయన అన్నారు.పాఠశాలలోనీ మరుగుదొడ్ల పరిశుభ్రత అలాగే పాఠశాల ప్రాంగణం పరిశుభ్రత కై వారానికి ఒకసారి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క సేవలను వినియోగించాలని ఆయన స్థానిక పంచాయతీ కార్యదర్శి ముజఫర్ బేగ్ కి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది ఉన్నారు.