జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ దాడిలో పట్టుబడిన పిడియస్ బియ్యం

నిజామాబాద్, ఏప్రిల్ 05 ( లోకంతీరు ) : నిజామాబాద్ సిపీ పి. సాయి చైతన్య, ఐ పీ యస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిబ్బంది, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లి లో అశోక్ లేలాండ్ వాహనం లో రవాణా అవుతున్న 7 టన్నులు పిడియస్ బియ్యం పట్టుకోవడం జరిగిందిపిడియస్ బియ్యం విలువ సుమారు 300000/- పట్టుబడిన నంబరు TS17 T8349 గల అశోక్ లేయలాండ్ వాహనంతో పాటు డ్రైవర్ షేక్ ఇమ్రాన్ ను తదుపరి చర్య నిమిత్తం ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ యస్ హెచ్ ఓ కు అప్పగించనైనది.