Take a fresh look at your lifestyle.

పింఛను పెంచుతానన్న సీఎం రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టకపోతే రాజీనామా చేయాలి….

0

పింఛను పెంచుతానన్న సీఎం రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టకపోతే రాజీనామా చేయాలి

ఎడపల్లి, సెప్టెంబర్ 18 ( లోకంతీరు ) :  ప్రస్తుత అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్ పెంపుదల చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ ఇంతవరకు అమలు చేయకపోవడం చాలా బాధాకర విషయం అని వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ అన్నారు.విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు,పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూవికలాంగులకు 6000/ పెన్షన్ ,వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4000/- పెన్షన్ పెంచాలని, కండరాల క్షీణ తగలవారికి 15000 పెన్షన్ ఇ. వ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000 /- పెంచుతామని అలాగే వృద్ధులు,వితంతువులు, ఒంటరిమహిళలకు,బీడీ కార్మికులకు 4000 పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు.అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిన మాట ప్రకారం పింఛన్ పెంచలేదు.చేయూత పింఛన్ పెంచుతానన్నా రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.చేయుత పింఛన్లను పెంచకపోయిన, కొత్త పింఛన్లను మంజూరు చేయకపోయినా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, లస్సింగారి భూమయ్య మాదిగ ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు, పిల్లంగోలి సావిత్రి మాదిగఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి, తాడెం అబ్బయ్య, ,పిల్లంగుల సాయమ్మ, ముంతాజ్ బేగం, నూర్జహాన్ బేగం, లక్ష్మి, కళావతి, సవిత, సుమలత,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.