ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమన్ బస్తీ రాంనగర్ బిర్జి ని సోమవారం నాడు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిస్థితిని సమీక్షించి మున్సిపల్ అధికారుతో మాట్లాడారు. రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం వల్ల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజాలకు ఎలాంటి హాని జరగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేసి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్య ఉన్న మున్సిపల్ సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ తన్నీరు రమేష్ , ఎమ్మార్వో ఎల్ కృష్ణ , మున్సిపల్ డి.ఇ. సాయి కిరణ్ , కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలు శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.