Take a fresh look at your lifestyle.

కందకుర్తి గోదావరి బ్రిడ్జి మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ . . .

0

Police Commissioner inspects Kandakurthi Godavari Bridge and Pushkara Ghats . . .

సోమవారం బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జిగౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారుపర్యవేక్షించడం జరిగిందిఈ సందర్భంగా కందకుర్తి లో గల ఎగువన నిజాంసాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి వరకు దాదాపు వచ్చింది అదేవిధంగా పుష్కర్ ఘాట్ ను కూడా పర్యవేక్షించడం జరిగిందిఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ రానున్న రెండుమూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనివరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారుఅత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారుఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయ్ బాబు, రెంజల్ ఎస్సై శ్రీ కె. చంద్ర మోహన్ , మండల వ్యవసాయ అధికారి శ్రీ సిద్ధి రామేశ్వర్ ఏ ఈ ఓశ్రీ గోపి కృష్ణ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.