ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

ఎడపల్లి, అక్టోబర్ 08 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం (ఐకెపి) ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎడపల్లి తహసిల్దార్ దత్తాత్రేయ ప్రారంభించారు. మండలంలోని మంగళ్ పహాడ్, వడ్డేపల్లి, ధర్మారం, బ్రాహ్మణపల్లి, దుబ్బ తండా, జమలం, గ్రామాలలో ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి తాసిల్దార్ దత్తాత్రేయ కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 23 89. బి గ్రేడ్ 23 69 రూపాయల ప్రభుత్వం తెలుస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని కి వారం రోజులనే రైతు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని ఆయన అన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి లాభాలు పొందాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాజేందర్, ఎడపల్లి మండల, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు హేమలత, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, భాస్కర్ ,సాయిలు, మధు, వినోద్, పాండురంగం, సిబ్బంది ,రైతులు పాల్గొన్నారు. పై గ్రామాలలో ఏర్పాటుచేసిన పొనుగోలు కేంద్రాల్లో ఓబీలు కుమ్మరి పుష్ప,జంగం సంధ్య, తక్కేల శ్యామల, మంజుల, గ్రామపంచాయతీ కార్యదర్శులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.