Take a fresh look at your lifestyle.

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం….

0

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ లకు అండ గా ఉంటా

– నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ అర్బన్, నవంబర్ 30 ( లోకంతీరు ) :  నగరంలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం

ఎమ్మెల్యే  మాట్లాడుతూ…..

మెకానిక్ వృత్తి సామాన్య ప్రజల దైనందిన జీవనంలో ఎంతో కీలకమని, వీరు అందించే సేవ సమాజానికి అనితరసాధ్యమని  పేర్కొన్నారు. రెండు చక్రాల వాహనాలు ప్రజల ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు పనిచేస్తున్న మెకానిక్‌ల పాత్ర అపూర్వమని తెలిపారు.అలాగే మెకానిక్‌ల ఆరోగ్యం (హెల్త్) పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని, రోజూ గ్రీసు, డస్ట్, కఠిన పరిస్థితుల్లో పనిచేస్తున్న నేపథ్యంలో వీరి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన హెల్త్ క్యాంపులు, జీవిత బీమా, ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన చికిత్సను అందించే విధంగా అన్ని విధాల సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అయన ప్రకటించారు.అలాగే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన మెకానిక్‌లకు అందేలా ప్రభుత్వంతో సమన్వయం చేసి సహాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అభివృద్ధికి అవసరమైన మౌలిక అవసరాలు కోసం  తన ఎమ్మెల్యే ఫండ్ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తానని  తెలిపారు. సామాన్యుల పురోగతే దేశ పురోగతి అని, మెకానిక్‌ల వంటి శ్రమజీవులకు  ఎమ్మెల్యే గా ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియచేశారు.కొత్తగా ఎన్నికైన అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి సహా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే  వారితో ప్రమాణస్వీకారం చేయించారు.కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి పొతన్ కార్ లక్ష్మీనారాయణ గారు,  టూ వీలర్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ సీనియర్ అడ్వకేట్ రాజేందర్ రెడ్డి, స్టేట్ మెకానిక్ ప్రెసిడెంట్ బాబు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గజ్జల మురళి, స్టేట్ ప్రచార సెక్రటరీ శ్రీకాంత్, కామారెడ్డి పట్టణానికి చెందిన బాబా, ప్రెసిడెంట్ గంగారాం, జనరల్ సెక్రెటరీ రామచంద్ర ,ట్రెజరీ గంగాధర్, బిజెపి నాయకులు  పవన్ గుండా సతీష్,  భాస్కర్,  అసోసియేషన్ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.