Take a fresh look at your lifestyle.

నేడు వినాయక విగ్రహాల శోభయాత్ర….

0

నేడు వినాయక విగ్రహాల శోభయాత్ర

ఎడపల్లి, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : ఏడపల్లి మండలంలో సుమారు క్రితం వినాయక మండపాల నిర్వాహకులు వినాయక చవితి పండగ సందర్భంగా మండపాలలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం సుమారు 130 వినాయక మండపాలు ఉన్నట్లు అధికారికంగా తెలిసింది. ఏది ఏమైనా తొమ్మిది రోజులలో మండలంలోని కొన్ని గ్రామాలలో వినాయక విగ్రహాల శోభాయాత్ర తో పాటు ఈ మధ్యన కార్యక్రమాలను మండపాల నిర్వాహకులు గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో స్థానిక చెరువులలో నిమజ్జనం చేశారు.


ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, పోలీస్ సిబ్బంది, వినాయకు నిమజ్జనం అయ్యేంతవరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా 11వ రోజున( నేడు) శనివారంమండలంలోని మిగతా గ్రామాలలో ఉన్నవినాయక విగ్రహాలను భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర అనంతరం నిమజ్జనo చేస్తారు. ఇందులో భాగంగా శుక్రవారానికి పదవరోజు కావడంతో వినాయక మండపాలవద్దభక్తులుతాము కోరుకున్న కోర్కెలను నెరవేరడానికి, అలాగే శుభం జరగాలంటు భక్తులకు నిత్య అన్నదానాలుచేస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ యువజన గణేష్ మండలి మండపం వద్ద శుక్రవారం స్థానిక గ్రామ యువకులుఏనుగు కిషోర్ కుమార్ దంపతులతో (ప్రభుత్వ ఉపాధ్యాయులు),పాటు కుటుంబీకులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటుచేసి వారు సైతం భక్తులకు అన్నదానంవడ్డాన చేశారు.స్థానిక డాక్టర్.బి ఆర్ అంబేద్కర్ యువజన గణేష్ మండలి నిర్వాహకులు, యువకులు, ముందుకు వచ్చి తమ వంతు సహకారంలో భాగంగా అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామస్తులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలు, చిన్నారులు వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వారు సైతం అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.