సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఎస్సై ముత్యాల రామకు సన్మానం
ఎడపల్లి, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఎడపల్లి ఎస్సై ముత్యాల రమకు మండపం నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గణేష్ నిమజ్జన సన్నాహాయిక సమావేశానికి ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై ముత్యాల రమ మాట్లాడాతూ గణేష్ శోబయాత్రతోపాటు నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో మండపాల నిర్వహకులు జరుపుకోవాలని కోరారు. ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా సోదర భావంతో ఐక్యతగా ఉండి మండపాల నిర్వాహకలు గ్రామ పెద్దలు, వినాయక శోభాయాత్ర తో పాటు నిమజ్జన కార్యక్రమాలను జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, రెడ్ క్రాస్ సొసైటీ ఎడపల్లి మండల అధ్యక్షులు మల్లెపూల శ్రీనివాస్, నాయకులు లక్షన్ గౌడ్, గ్రామ పెద్దలు యువకులు తదితరులు ఉన్నారు.