ఎడపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక
ఎడపల్లి, సెప్టెంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎలక్ట్రానిక్ మీడియా ,ప్రింట్ మీడియా పాత్రికేయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమిష్టి కృషి ఐక్యతతో జరుపుకున్నట్లు పాత్రికేయులు తెలిపారు. ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కదం ప్రకాష్ రావు( కే6), ఉపాధ్యక్షులుగా పోశెట్టి (నవతెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా జక్కం రాజ్ కుమార్ (భారతి ఛానల్), కోశాధికారిగా జగన్మోహన్( లోకల్ ఛానల్). సలహాదారులుగా భుజంగం లింగం, (RTI అప్నా ఛానల్),శేఖర్ గౌడ్( నమస్తే తెలంగాణ), సునీల్ (సాక్షి), రవికుమార్ (ఈనాడు), విజయ్ గౌడ్ (ఆంధ్రప్రభ), రవి నాయక్(మెట్రో ఈవినింగ్ పేపర్),కందునూరి గంగాశంకర్ (లోకం తీరు), లింబాద్రి సతీష్, (దృశ్యం), గంగాధర్ (ఎక్స్ప్రెస్,) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సహా పాత్రికేయులు పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదంప్రకాష్ రావు మాట్లాడారు. పాత్రికేయులు తమ వృత్తిపరంగా సమస్తకు, ఇటు ప్రజలకు అధికారులకు సమన్వయంగా పనిచేస్తూ అధికారుల ప్రజల అభిమానాన్ని చురగొనాలన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అందరం ఐక్యతగా పాటుపడదామని.ప్రెస్ క్లబ్ అభివృద్ధితోపాటు, పాత్రికేయూల సమస్యల పరిష్కారానికి నిరంతరం కలిసిమెలిసి ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా పనిచేయాల్సిన అవసరం ఉందని సలహాదారులు అన్నారు.