Take a fresh look at your lifestyle.

అంగన్వాడి కేంద్రంలో పోషణ వనం…..

0

ఎడపల్లి మండలంలో ఆదర్శంగా నిలుస్తున్న అంగన్వాడి కేంద్రం

ఎడపల్లి, సెప్టెంబర్ 06  ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలోని 108 అంగన్వాడి కేంద్రoలో నాటిన మొక్కలు కాయగూరలతో పాటు వివిధ రకాల పండ్లు కూరగాయలు పెంపకం చేస్తున్నారు ఎడపల్లి మండలంలోనే ఆదర్శ అంగన్వాడి కేంద్రంగా నిలిచింది ఈ అంగన్వాడి కేంద్రానికి గతంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వరరావు ఎడపల్లి వడ్డేపల్లి గ్రామాల ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు ఎడపల్లి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పోషణ వనంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని ఉపాధ్యాయులు అన్ని అంగన్వాడి కేంద్రాల ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అప్పటి ఆర్డీవోరాజేశ్వరరావు తాజా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ వడ్డేపల్లి సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడి ఉపాధ్యాయురాలు దేవ కుమారి కేంద్ర ఆవరణంలో వివిధ రకాల కూరగాయలు పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆకుకూరలు కాయగూరలు సేంద్రీయ ఎరువులతో పంటలు పండించి పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు నాణ్యమైన భోజనంతోపాటు పౌష్టిక ఆహారాన్ని అందించడం అభినందనీయమని ఆమెను ప్రశంసించారు అధికారులు ప్రజాప్రతినిధులు ఆ శాఖ ఐసీడీసీ అధికారులు ఆమెను ఘనంగా సన్మానించారుపూర్వ వైభవ తలపిస్తుంది. కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి ఉపాధ్యాయురాలు దేవకుమారి తో పాటు ఆయా రాణి విధులు క్రమంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విధి నిర్వహణలో ఉంటూ, అటు చిన్నారి బాల బాలికలకు ఆటపాటలతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను ఉపాధ్యాయురాలు దేవకుమారి విద్యాబోధన చేస్తున్నారు. పక్షం రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి చిన్నారి బాలబాలికలకు ఎత్తులు బరువులు కొనడంతో పాటు, ఎడపల్లి ఆస్పత్రి సిబ్బందితో ఆరోగ్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. చిన్నారి బాల బాలికలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే చదువు పైన మంచి దృష్టి సారిస్తారు.ఇది గమనంలోకి తీసుకున్న అంగన్వాడి ఉపాధ్యాయురాలు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 15 మంది బాల బాలికలు అంగన్వాడి కేంద్రంలో నమోదయి ఉన్నారు. అలాగే గర్భిణీ మహిళలు 15, బాలింతలు 09, మంది ఆమె అంగన్వాడి కేంద్రంలో నమోదయ్యారు. అటు చిన్నారి బాధ బాధితులకు పౌష్టికాహారాన్ని క్రమంగా అందిస్తూ, గర్భిణీ మహిళలకు అటు బాలింతలకు పాలు గుడ్లు, బాల అమృతాన్ని క్రమంలో పంపిణీ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా అంగన్వాడి కేంద్రంలో కిషన్ షెడ్డు (పోషణ వనం) ఏర్పాటు చేసి ఆమె అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు పళ్ళ తోటలను పెంపకం చేస్తున్నారు.అలాగే జామకాయలు, చితపతల పండ్లు,పో ప్పరి,దానిమ్మ, పండ్లు పెంపకం చేసి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఉసిరి, నిమ్మకాయలు ,అల్లనేరడి రకరకాల పండ్ల తోటలు, అలాగే రత్నపురి గడ్డలు ,ఆలుగడ్డలు అంగన్వాడి కేంద్ర ఆవరణంలో పెంపకం చేస్తున్నారు. కాకరకాయ అరటి పండ్లు, ఉసిరి, జామ ప్రస్తుతం పెద్దగా పెరిగి కాయలు కాషాయి, అలాగే ఆకుకూరలైన గోంగూర, పుంతి కూర, చామకూర ,సొరకాయ బెండకాయ, కాకరకాయ, టమాటలు ఆరుతడి పంటలను పండిస్తూ చిన్నారి బాలబాలికలతో పాటు మహిళలకు సకాలంలో నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తున్నారు.సేంద్రియ ఎరువులతోఈపంటలను పండిస్తున్నారు.కేంద్రంలో ఆలాదకరమైన వాతావరణం తలపిస్తుంది.ఈటు వైపుగా పచ్చని చెట్లు అటువైపుగా ఆకుకూరలు పళ్ళ తోటలు పూల మొక్కల తో కేంద్రానికి వచ్చే చిన్నారి బాలబాలికలకే కాకుండా మహిళలకు, బాలింతలకు ఆయా శాఖల అధికారులకు, స్థానిక గ్రామ పెద్దలకు చిన్నారి బాల బాలికల తల్లులకు మంచి వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ప్రతి అంగన్వాడి కేంద్రంలో కిషన్ షెడ్ (పోష ణవనం), చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఎడపల్లి మండలంలో కొన్ని అంగన్వాడి కేంద్రాల ఆవారాల మాత్రమే తలపిస్తున్నాయి. మిగతా అంగన్వాడి కేంద్రాలలో పోషణ వనం ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు అనేది స్పష్టంగా వినబడుతుంది. ఏది ఏమైనా పడితే వీరపల్లి మండలం వడ్డేపల్లి 108 అంగన్వాడి ఉపాధ్యాయురాలు దేవ కుమారి గతంలో అనేక రకాల ఆకుకూరలు పళ్ళ తోటలు పూల మొక్కలను పెంచి ఆ శాఖ అధికారుల మండలను పొందారు. ఇప్పటికి కూడా ఆమె కేంద్ర ఆవరణంలో కిచెన్ షెడ్ పోషణ వనం ఏర్పాటుచేసి ఇన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పళ్ళ తోటలు పూల మొక్కలను పెంచడం ఆలా అధికమైన వాతావరణంలోని కల్పించడం పట్ల గ్రామస్తులు హర్షణ వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి బాలబాలికలకు సేవలు చేయడం అదృష్టం.అంగన్వాడి ఉపాధ్యాయురాలు  దేవ కుమారి, వడ్డపల్లి (గ్రామం.) . సుమారు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాలం నుండి అంగన్వాడి ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న, బాల బాలికలకు విద్యాబోధనతోపాటు ఆటపాటలు నేర్పించడం తాను అదృష్టంగా భావిస్తున్నా, అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్న, ఎత్తు బరువులు కొలవడం జరుగుతుంది. రక్తహీనత లోపం తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నాం, ఆకుకూరలు పౌష్టికాహారాన్ని సకాలంలో అందజేస్తున్నా, అలాగే చిన్నారి బాల బాలికలకు ఇష్టమైన పండ్ల తోటలను పెంపకం చేసి వారికి కావలసిన జామ, అరటి, బొప్పాయి, ఉసిరి రకరకాల పండ్లను అందజేయడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నాం. ఇలాంటి సేవలు చేయడం విధి నిర్వహణలో భాగంగా తాను అదృష్టంగా భావిస్తున్నాను.

Leave A Reply

Your email address will not be published.