Take a fresh look at your lifestyle.

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది….

0

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది

– బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి 

ఎడపల్లి, సెప్టెంబర్ 08 ( లోకంతీరు ) : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా రంగ సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులతో పాటు యువతకు బావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు ఫంక్షన్ హాల్లో బోధన్ పట్టణం ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతైనా ఉందన్నారు. దశాబ్దాలుగా బోధన పట్టణం విద్యారంగంలో ప్రముఖంగా ఒక వెలుగు వెలిగిన రోజులు నేటికీ ఉన్నాయన్నారు. వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత నేటి సమాజంలో ఉపాధ్యాయులకుఎంతైనా ఉందన్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే కాకుండా చిన్నప్పటినుండి నైతిక విలువలను బోధించాలన్నారు.పాఠశాలలో ,కళాశాలలో గంజాయి, మాదక దవ్యాలు దగ్గరకు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఉత్తమ బోధనతోపిల్లల్లో బాధ్యతను పెంచాలన్నారు. విద్యార్థిని విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను విరికి తీయడంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం బోధన్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు కొడాలి కిషోర్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్. హుoదాన్ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ పి డి, జి .లక్ష్మీ బసవేశ్వర్ రావు, బోధన్ఎసిపి శ్రీనివాస్, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాస్ రావు, సూర్య ప్రకాష్ రావు, హరికృష్ణ, విజయ్ కుమార్, కృష్ణమోహన్, దిగంబర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్, శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.