శివాజీ విగ్రహం వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

ఎడపల్లి, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా శివాజీ విగ్రహం వద్ద భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రాంచందర్(అన్నాసేట్) జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం భరతప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలో గల శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి అన్న ప్రసాద వితరణ లో పాల్గొనడం జరిగిందిఈ కార్యక్రమంలో బాజ పా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు కంజరి ప్రదీప్ కుమార్, కట్కాo అరుణ్, మరాఠ వీరేందర్, మండల ఉపాధ్యక్షులు బట్టు రాజు, సీనియర్ నాయకులు గంగుల కృష్ణ, లక్ష్మణ్ గౌడ్, ద్యాకం సాయరెడ్డి,చైతన్, అనిరుద్ గౌడ్, మీసాల రఘు, ప్యాట గంగాధర్, దేరాడి నగేష్, బర్దిపూర్ ప్రణయ్,నవీన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంగల్ పాడ్ భారతీయ జనతా పార్టీకార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.